నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

21. ఓం శివాయ నమః
పరమ సంతోషరూపము, ప్రాణికోటి
రాకపోకల ధామము, రక్షభద్ర
మంగళ శుభాల మూలము - లింగమూర్తి
శివుడు - సత్యసుందరునికే సేవజేతు

22. ఓం మహేశ్వరాయ నమః
సర్వలోకైక సుశ్లోక చక్రవర్తి
భువన సృష్టి స్థితి లయాల మూల మూర్తి
పక్షపాత రహిత దయావృక్ష కీర్తి
జ్ఞాన దాత ‘మహేశ్వరున్’ సంస్తుతింతు

23. ఓం శంభవే నమః
పంచ కర్దేయాలిచ్చి పంచె సుఖము
జ్ఞాన పంచేద్రియాల విజ్ఞత యునిచ్చె
కడకు వైరాగ్య భావ సుఖమ్ము కూర్చె
‘శంభు’ నామార్థవిది సంస్తవ ముజేతు
ఆ పినాక ధరుని కొల్తు ఆహరహమును

కడియాల మధుసూదన రావు 9030907191