నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. ‘కొడుకు జన్యనంబుఁ గొని నీవు నిజరాజ్య
భూరి భరము వానిఁ బూన్చునప్పు
డతని కెద్ది గఱపి’ తని యడిగిన హరి
కయ్యయాతి యిట్టు లనుచు ఁబలికె
భావం: ‘కొడుకైన పూరుడి వనాన్ని నీవు గ్రహించి అతడిని విస్తృతవైన నీ రాజ్యభారాన్ని భరింపచేసేటప్పుడు అతని కేమి బోధించావు? అని ఇంద్రుడు అడుగగా యయాతి ఇంద్రుడితో ఇట్లా పలికాడు. యయాతికి శాపం వల్ల వచ్చిన ముదిమిని పూరుడికి ఇచ్చి తాను ఇంద్రభోగాలను అనుభవించి చివరకు మళ్లీ పూరుని యవ్వనాన్నిపూరునకు ఇచ్చివేసి దానితోపాటే యయాతి తనరాజ్యాన్నంతా పూరునికి కట్టబెట్టి తాను తపోవనానికి వెళ్లాడు. తపస్సుచేసి ఇంద్రాదిలోకాలకు యయాతి వెళ్లాడు. ఆసమయంలో ఇంద్రుడు వచ్చి యయాతితో ఇంత రాజ్యభారాన్ని పూరునకు ఇచ్చివేశావు కదా మరి రాజ్యంతోబాటుగా ఏరకమైన బోధ చేశావు అని యయాతి మహారాజును అడిగాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము