నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం పూషదంతభిదే నమః
పూష యనెడి ఆదిత్యుడు పోయి దక్ష
యజ్ఞమున శివనింద జేయంగ జూచి
ఇనుని పళ్ళూడగొట్టె చండీశ్వరుండు
‘పూషదంతభిద’ని పేరుపొందె శివుడు
ఓం దక్షాధ్వరహరాయ నమః
శంకరుడులేని దక్షయజ్ఞంబు నందు
బిడ్డ సతినవమానించె పితరుడపుడు
యోగవహ్నిని సతి మండిపోవ శివుడు
వీరభద్రుడై యజ్ఞమ్మువిరుగ వైచె
అటుల ‘దక్షాద్వరహరా’ఖ్యుడెయ్య నతడు
ఓం హరాయ నమః
పాపియైనను ఘోర ముక్కోపియైన
మందుడైనను రాకాసి బందుగైన
హరుని తలచిన హరియించు హానికోటి
‘హరుడు’ సార్థకనామ భాసురుడె రక్ష
ఓం భగనేత్రభిదే నమః
భృగుడు దక్ష యజ్ఞమునకు వెళ్లి శివుని
నిందసేయగ కోపించి చండీశ్వరుండు
కనులు పీకివైచెను; దర్భగామనుమని
తాను ‘్భగనేత్రభిదుడ’య్యె ధరణిలోన

కడియాల మధుసూదన రావు 9030907191