నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. మందుఁడ నని నున్న నింద ఁ జేసిన నేమి?
నా దీనతను జూచి నవ్వనేమి?
దూర భావము లేక - తూలనాడిన నేమి?
ప్రీతి సేయక వంకఁ బెట్టనేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
తీవ్రకోపము చేత దిట్టనేమి?
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి?
చేరి దాపడ గేలి సేయనేమి?
తే. కల్పవృక్షము వలె నీవు గల్గనింక
ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురిత దూర!

భావం;పద్మనాభ ! నరసింహస్వామీ ! మందబుద్ధిననీ, దీనుణ్ణి నీ నిందించిన కసిరి కొట్టినా , తప్పులెంచినా, తూలనాడినా, తిట్టినా, అనరాని మాటలన్న, గేలి సేసినా, ఈ జనులు ననే్నమన్నా కోరిన కోర్కెల్ని పండించే కల్పతరువు లాంటి నీవుండగా వీళ్లని లెక్క చేయవలసిన పనేముంది?