నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. శ్రవణ రంధ్రముల నీ సత్క్థల్ సోకంగ
లేశమానందంబు లేని వాఁడు
పుణ్యవంతులు నిన్ను ఁ బూజ సేయఁగఁ జూచి
భావమందు త్సాహపడని వాఁడు
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ
దత్పరత్వము లేక తలఁగుఁవాఁడు
తన చిత్తమందు నీ ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృథా గడపువాఁడు
తే. వసుధలో నెల్ల వ్యర్థుఁడు వాఁ డెయగును
మరియుఁ జెడుఁగాక యెప్పుడు మమత నొంది
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!
*
భావం: స్వామీ! నీ కథలు చెవిసోకితే సంతోషించని వాడు, పుణ్యాత్ములు, నీ పూజచేస్తే చూచి ఉత్సాహపడనివాడు, భక్తులు నిన్ను పొగిడితే పరవశించనివాడు, అంతరాత్మలో నిన్ను స్మరించక కాలమంతా వ్యర్థపుచ్చేవాడు, ప్రపంచంలో వ్యర్థుడే. వాడు వ్యామోహితుడై చెడిపోతాడు.