నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఉర్విలో వాయు ష్యమున్న పర్యంతంబు
మాయ సంసారంబు మఱఁగి నరుఁడు
సకల పాపములైతె సంగ్రహించు ను గాని
నిన్ను ఁ జేరెడి యుక్తి నేర్వలేఁడు
తుదకుఁ గాలుని యొద్ద దూతలిద్దఱు వచ్చి
గుంజుక చనినారు కొట్టుచుండ
హింస కోర్వఁగ లేక యేడ్చి గంతులు నైచి
దిక్కు లేదని నాల్గు దిశలు చూడ
తే॥ తన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడేడి
ముందె నీ దాసుఁ డై యున్న - ముక్తి గలుగు
భూషణ వికాస ! శ్రీధర్మ పుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ స్వామీ! మానవుడు ఈ ప్రపంచంలో బతికినంతకాలం సంసారమాయకు లోబడి సమస్త పాపాల్ని ప్రోగు చేసుకొంటాడే కానీ నిన్ను పొందే ఉపాయాన్ని కనుగొనలేడు. చిట్టచివర యమభటులిర్వురు వచ్చి ప్రాణాల్ని గుంజుతూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక కాపాడమని చూస్తాడు. విడిపించే పుణ్యాత్ముడెవడూ కన్పించడు. అందువల్ల ముంద నీ భక్తుడై ఉంటే మేలుకదా. మోక్షం సిద్ధిస్తుంది.