నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ అధిక విద్యావంతులప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి
సత్యవంతుల మాట జనవినోదంబాయె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాదనపరుల్ దారిద్య్రమొందిరి
పరమ లోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడుతులైరి
దుష్టమానవులు వర్ధిష్ణులైరి
తే॥ పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తి లేదాయె నిఁక నీవె చాటు మాకు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ స్వామీ విద్యావంతులు ప్రయోజనం లేనివాళ్లు, మూర్ఖులు, గౌరవార్హులవుతున్నారు. నిజం మాట్లాడితే గిట్టదు. అధిక ప్రసంగులు రాణిస్తున్నారు. ధర్మపరాయణులు దరిద్రులవుతున్నారు. పిసినిగొట్టులు ధనవంతులవుతున్నారు. పుణ్యాత్ములు రోగ పీడితులవుతున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. నావంటి వారికి శక్తి లేదు. కనుక నీవే మాకు దిక్కు.