నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. సురదైత్య యక్షరాక్షస
నరఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భా
సుర తపములు బాఁదగు దు
ష్కర ఘోరతపంబు సరియుఁగా నమరేంద్రా!
భావం: దేవతలకు రాజైన ఓ ఇంద్రుడా! దేవతల, దైత్యుల,యక్షుల, రాక్షసుల, మానవుల ఆకాశ సంచారుల సిద్ధుల, మునుల సముదాయాలలో శ్రేష్ఠులైన వారి ప్రకాశించే తపస్సులు చేయశక్యం కాని తీవ్రమైన నా తపస్సుకు సమానం కావు. యయాతి కొన్నివేల సంవత్సరాలు నిరాహారంగాను, పంచాగ్నుల మధ్య నిలబడిన్నూ తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించి మరీ సత్య, బ్రహ్మ, ఇంద్రలోకాలలో హాయిగా స్వేచ్ఛగా తిరిగాడు. అట్లాంటి సమయంలో ఇంద్రుడు యయాతిని చూచి నీవు అనేక సంవత్సరాలు భూలోకంలో ఉండి ఇంద్రియసుఖాలను పొందావు. తరువాత నియమనిష్ఠలతో తపస్సును సైతం ఆచరించి ఈ దివ్యలోకాలకు వచ్చావు నీవు నీకుమారుడితో ఏమి చెప్పావు అని అడుగుతున్నప్పుడు యయాతి తాను తన కుమారునికి చెప్పిన నీతిని ఇంద్రుడు చెబుతూ మాటల మధ్యలో తాను ఎంత గొప్పతపస్సును చేశాడో ఆ తపస్సు ఎంత విలువైనదో అనాలోచితంగానో , గర్వం ఆవేశించో ఇంద్రుడితో మాట్లాడాడు..

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము