నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. సురపతి నా తపమున క
చ్చెరువడి నీ తపము పేర్మిఁ జెప్పుమయనినన్
సురసిద్ధ మునీంద్ర తప
శ్చరణలు నా తపము తోడ సరిగా నంటిన్

భావం: ఇంత తపస్సుచేసి దివ్యలోకసందర్శనం చేసిన యయాతి ని చూచి నక్షత్రలోకవాసులు విస్మయులైయ్యారు. ఆ నేపథ్యంలో వారు యయాతిని చూచి ఇంత చేసిన తరువాత మీలోఅహంకార మనే చీకటి ఏవిధంగా చేరిందో అని వారు అడుగగా యయాతి వారికి సమాధానం ఇస్తూ - దేవతలకు రాజైన ఇంద్రుడు నేను చేసిన తపస్సు కాశ్చర్యపడి ‘నీ తపస్సు యొక్క మహత్త్వం చెప్పు ’ అని అడుగగా నేను ‘దేవతల, సిద్ధుల, మునిశ్రేష్ఠుల తపఃకార్యాలు నాతపంతో సమానంకా’ వని చెప్పాను. ఇక ఏముంది అని యయాతి తాను చేసిన తప్పిదాన్ని వారికి వివరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము