నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు
లోపల నంతట రోయరోత
నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త
మాంసపు కండల మైల తిత్తి
బలువైన యెండ వానల కోర్వదింతైన
తాళలేదాకలి దాహములకు
సకల రోగములకు సంస్థాన మై యుండు
నిలువ దస్థిరమైన నీటి బుగ్గ
తే. బొందిలో నుంచు ప్రాణముల్ పోయినంతఁ
గాటికే గాని కొఱగాదు గవ్వకైన
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురిత దూర!
భావం: నరసింహ ప్రభూ! ఈ శరీరం మెత్తని చర్మంతో చేసిన తోలుతిత్తి. ఇందులో ఎలాంటిసారం లేదు. లోపల చూద్దామా అంటే అంతా అసహ్యమే. నరాలు, ఎముకలు, మాంసం, నవ రంధ్రాలు, కండలు కల్గిన మైల తిత్తి. ఆకలి దప్పులకు తాళలేదు. అన్నిరోగాలకు పుట్టినిల్లు. అంతరించిపోయే నీటిబుగ్గ. ఈ బొందిలో ప్రాణాలు అంతరించిన తర్వాత ఈ శరీరం కాటికి గాని గవ్వకైనా పనికిరాదు.