నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అమర విభుండు దాని విని యల్గి ‘మదంబున నుత్తమానవా
నము దగునయ్య చేయ*నని నన్ను నధోభువున ప్రపాతసం
భ్రమవివశాత్ముఁజేసె నది పాడియ యెందును నల్ప మయ్యు ద
ర్పము బహు కాల సంచిత తప్ఫఃలహాని యొనర్పకుండునే
భావం: దేవేంద్రుడు నా మాట విని కోపించి ‘గర్వంతో శ్రేష్ఠులైన వారి ని అవమానించడం తగునా? ’ అని నన్ను క్రింది లోకాలకు పడమందు వేగిరపాటు చేత వశం తప్పిన ఆత్మకలవాడినిగా చేశాడు. అది న్యాయమే. ఎక్కడైనా స్వల్పమైన దైనా గర్వం పెద్దకాలం చేసిన తపస్సు యొక్క్ఫలాన్ని నాశనం చేయకుండా ఎట్లా ఉంటుంది? యయాతి తాను చేసిన పనులను ఒక్కసారి ఆలోచించుకుని నక్షత్ర లోకంలో ఉన్నవారికి అఖండ మైన కీర్తి ఇటు భూలోకంలోను, అటు పరలోకంలోను సంపాదించుకొన్న కూడా తాను నక్షత్రలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో అక్కడున్నవారు అడుగగా ఎవరికైనా గర్వం అహంకారం ఉండకూడదని దానివల్ల నాశనమే జరుగుతుందని తెలిపాడు. తాను చేసిన పనిని ఇంద్రునికి వివరించే సమయంలో గర్వంగా మాట్లాడాడని దాని వలన గొప్పవారిని నిందించడం జరిగిపోయిందని దానితో ఇంద్రునకు కోపం వచ్చి తన్ను శపించాడని చెప్పాడు. కాని యయాతి తనకున్న విచక్షణాజ్ఞానం వల్లనే జంభారి చేసిన పనిని సరియైనదే అని చెప్పగలిగాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము