నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నీ భక్తులను కండ్లనిండఁ జూచిన రెండు
చేతుల జోహారు సేయువాఁడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ
వినయమందుచుఁ జాల వినెడువాఁడు
తన గృహంబునకు నీదాసులు రాజూచి
పీటపై ఁ గూర్చుండఁ బెట్టువాడు
నీ సేవకులజాతి నీతులెన్నక చాల
దాసోహమని చేరదలచువాడు
తే. పరమ భక్తుండు ధన్యుండు భానుతేజ
వాని గనుగొన్న పుణ్యంబు వసుధలోన
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహాస్వామీ! కళ్లారా నీ భక్తుల్ని చూచి రెండు చేతులెత్త నమస్కరించేవాడు, ఎవరైనా నీ కథల్ని నైపుణ్యంగా చెప్తే వినయంగా వినేవాడు, తన ఇంటికి నీ దాసులు వస్తే పీట మీద కూర్చోబెట్టేవాడు, నీ యాచకుల కుల వర్గ భేదాలు పాటించకుండాదాసోహమ్మని నీకు ఊడిగం చేసేవాడు పరమ భక్తుడు. అతడు గొప్ప ధన్యుడు. అలాంటివాణ్ణి చూస్తే గొప్ప పుణ్య ఫలం లభిస్తుంది.