నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నిగమాది శాస్తమ్రుల్ నేర్చిన ద్విజుఁడైన
యజ్ఞకర్తగు సోమయాజియైన
ధరణిలోపల ప్రభాత స్నానపరుఁడైన
నిత్య సత్కర్మాది నిరతుఁడైన
నుపవాస నియమంబు నొందు సజ్జనుఁడైన
గాని వస్తమ్రుఁ గట్టు ఘనుఁడునైన
దండి షోడశమహాదానపరుండైన
సకల యాత్రలు సల్పు సరసుఁడైన
తే. గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్ష సామ్రాజ్య మొందఁడు మోహనాంగ!
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురితదూర!

భావం: ఓ ప్రభూ! వేదశాస్త్రాల్ని అభ్యసించిన బ్రాహ్మణుడైన, యజ్ఞయాగాలు చేసే సోమయాజినైనా ఉదయకాల స్నానకృత్యం నిర్వర్తించే వాడైనా, నిత్యం సత్కర్మలే చేసేవాడైనా ఉపవాసవ్రతాలు చేసేవాడైనా, కాషాయంమరాలు తాల్చే సన్న్యాసియైనా పదహారు రకాల దానాలు చేసేవాడైనా, పుణ్య తీర్థక్షేత్రాలు తిరిగేపుణ్యాత్ముడేయైనా పొగరుపోతై నిన్ను సేవించక పోతే ముక్తినొందడు కదా.