నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. క్షమ లేని తపసి తపమును
బ్రమత్తుసంపదయు ధర్మబాహ్వప్రభురా
జ్యము భిన్న కుంభమున తో
యముల ట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్
భావం: అయ్యో! ఎంత పని చేశావు. అసలు ముక్కుమూసుకొని తపస్సు చేసుకొనే యోగివర్యులకు ఇంతటి కోపం ఎందుకు కోపం ఎంత వినాశనానికి హేతువు అవుతుంది అంటూ ఓర్పు లేని ముని తపస్సున్నూ. ప్రమాద పడేవాడిధనమున్నూ, ధర్మం నుండి తొలిన రాజు రాజ్యమున్నూ , ఇవన్నియు బ్రద్ధలయిన కుండలోని నీళ్ల వలె అస్థిరాలవుతాయి.
మునులకు ఉండరాని కోపాన్ని నీవు ఎందుకు దరిచేర్చావు. ఆలోచించకుండానే భూమిని రక్షించే నాథుడైన రాజుకు శాపమిచ్చావు గొప్ప గొప్ప మునులు తీవ్రమయిన తపస్సు చేస్తూ వేదాలచే విధింపబడిన ధర్మకార్యాలు కొనసాగిస్తూ గొప్ప శక్తి కలవారై ఉన్నారు. అట్ట రాజులకు కీడు తలపోయడం కంటె అధికతరమైన పాపం మరొకటి ఉండదు. భరతవంశాన్ని పవిత్రం చేసేటి పరీక్షిన్మహారాజును సామాన్యుడైన రాజుగా తలపోశావా అని అనేక విధాలుగా శమీకుడు తన కుమారుడు చేసిన పనికి వగచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము