నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పద్మాక్ష! మమతచేఁ బరము నందెదమంచు
విఱ్ఱవీగెదమయ్య వెఱ్ఱినంటి
మా స్వతంత్రంబైన మదము కండ్లకుఁ గప్పి
మొగము పట్టదు కామ మోహములకు
బ్రహ్మదేవుండైనఁ బైడి దేహము గల్గఁ
జేసివేయక మమ్ము ఁ జెఱచెనతఁడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ము కలతోడి
ముఱికి చెత్తలు చేర్చి మూట కట్టె
తే. నీ శరీరాలుపడిపోవుటెఱుఁగ కేము
కాముకుల మైత్రి మిఁక మిమ్ముఁ గానలేము
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
*
భావం: నరసింహ స్వామీ! పద్మము వంటి కన్నులుగలవాడా! ప్రేమ వల్లనే స్వర్గమందగలమని భ్రాంతిపడి గర్వించాము. మాకు జన్మ సిద్ధమైన అహంకారం కళ్ళకు గప్పి కామమోహాల వల్ల మొగం వాచింది. కనీసం బ్రహ్మదేవుడైనా బంగారు శరీరము ఇవ్వకుండా హేయమైన తోలు ఎముకలు కట్టబెట్టి మురికి చెత్త మూటకట్టాడు. ఈ తనువులు రాలిపోతాయని తెలీదు. మేము కాముకులం నిన్ను చూడలేం.