నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తిరుపతి స్థలమందుఁ దిన్నగానేనున్న
వేంకటేశుఁడు మేత మనేయలేఁడొ?
పురుషోత్తమునకు నేఁ బోయిన ఁ జాలు జ
గన్నాథుఁ డననంబుఁ గడపలేఁపొ?
శ్రీరంగమునకునే ఁ జేరఁ బోయిన ఁజాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేఁడొ
కాంచీపురములోనఁ గదిసి నేఁ గొలువున్నఁ
గరివరదుఁడు పొట్ట గడపలేఁడొ?
తే. ఎందుఁబోనక నేను నీ మందిరమున
నిలిచితిని నీకు నా మీఁద నెనరులేదు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహ ప్రభూ! తిరుపతిలోనే ఉంటే వెంకన్న ఇంత తిండి పెట్టేవాడే - పూరీ వెళ్లితే జగన్నాథుడు పట్డెడన్నం సమకూర్చేవాడే . శ్రీరంగం వెళితే రంగేశుడు గ్రాసమిచ్చి కాపాడేవాడే. కంచికి వెళ్లితే శ్రీహరి నా పొట్టకింత తిండిపెట్టేవాడే. ఎక్కడికి పోయినా నా పూగ గడుస్తుంది. అయితే నేను ఎక్కడికి పోకుండా నీ మందిరానే్న కాచుక కూర్చున్నా నా మీద దయలేదు నీకు.