నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అమరేంద్రవినుత! నే నతి దురాత్ముడ నంచుఁ
గలలోనగైనను కమలఁ బడవు
నీవుప్రత్యక్షమై విలువకుండిన మానె
దొట్టగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టి కొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీ స్వరూపము జేసి నిలుపుకొందు
ధూప దీపములిచ్చి తులసి తో పూజించి
నిత్యనైవేద్యముల్ నీమముగను
తే. నడుపుచును నిన్నుఁ గొలిచెద నమ్మి బుదిధ
నీ ప్రపంచంబు గలిగే నాగింతె చాలు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం! ఓ ప్రభూ! నీవు ఇంద్రునిచే స్తుతింపబడినవాడవు. నేను మిక్కిలి చెడ్డవాడనని భావించి నాకు కలలో కూడా కన్పించకున్నావు. నీవుకన్పించకపోతే పోనీ నాకొక ఉపాయం తట్టింది. గట్టి కర్రనొక దాన్ని తెచ్చి , నీ రూపం చెక్కి నా ఎదుట బెట్టుకుని దానికి ధూప దీపాలు నిత్యనైవేద్యాలు సమర్పిస్తూ మనసారా కొలుస్తాను. మంచి లోకమే దొరికింది ఇంతే చాలు.