నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అందరేమైన నిన్నడుగ వచ్చెదరంచు
క్షీర సాగరమందుఁ జేరినావు
నీ చుట్టు సేవకుల్ నిలువ కుండుటకునై
భయద సర్పము మీద బండినావు
భక్త బృందము వెంటబడి చరించెదరంచు
నెగిరిపోయెడి పక్షినెక్కినావు
దాసులు నీ ద్వార మాసింపకుటకై
మంచి యోధుల కాపునుంచినావు
తే. లావుగల వాడవైతి వేలాగు నేను
నిన్ను జూతురు నా తండ్రి ! నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార!నరసింహ ! దురిత దూర!

భావం: ఓ ప్రభూ! నీ భక్తులేమైన అడగటానికి నీ దగ్గరకు వస్తారేమోనని పాలసంద్రంలో నివసిస్తున్నావు. నీ చుట్టూ సేవకులు నిలబడకుండా ఉండడానికి పెద్ద సర్పంపై పడుకున్నావు. భక్తులు వెంటబడుతారేమోననుకొని వారికి చిక్క కుండా ఉండడానికి పక్షి వాహనాన్ని ఎక్కి ఎగిరిపోతావు. నీ భృత్యులు నీ గడప తొక్కకుండా నుండడానికి జయవిజయులనే ద్వార పాలుర్ని కాపలా పెట్టావు. ఇంత బలాఢ్యుడవయ్యావు. నినె్నలా నేను చూడగలను నా తండ్రీ!