నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. మత్స్యావతారమై మడుగు లోపల జొచ్చి
సోమకాసురు ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల దేవ భూసురులకు
మెచ్చి ఇచ్చితి నీవు మ ఏలు నొంద
నా వేదములన్నియ్య నాచార నిష్ఠల
ననుభవించుచు నుండు రవనిసురులు
సకల పాపంబులు సమసిపోవు నటంచు
మనుజులందరు నీదు మహిమ దెలిసి

తే. యుందురిటువంటివా నీయునికి దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ
భూషణ వికాస ! శ్రీధర్మ పుర నివాస!
దుష్టసంహార!నరసింహ! దురిత దూర!
*
భావం: ఓ నరసింహ స్వామీ! మత్స్యావతారమెత్తి మడుగులో చొచ్చి సోమకాసురుని చంపి వేదాలను ఉద్దరించావు. వాటిని దేవతలకు, బ్రాహ్మణులకు అప్పగించావు. బ్రాహ్మణులు నియమాచారాలతో వాటిని అనుభవిస్తున్నారు. సకల పాపాలు వైదొలుగుతాయని ఇలాంటి వారెల్లరు నీ మహిమల్ని గూర్చి తెలుసుకొంటున్నారు. నిన్ను బాగా తెలిసిన వాళ్లకి ముక్తి త్వరగా లభిస్తుంది.