Others

శివారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా. కాకోలంబును కంఠ సీమ నిలుపంగా జాలి నొవంచు నిన్
శ్రీకంఠేశ్వరుడంచు మ్రొక్కెదరు గానీ! తీవ్ర వాదానలం
బోకైలాసపతీ! నివారణము సల్పున్ దక్షతన్ జూపినన్
నీకున్ శంకర! భక్తి నిత్య శివరాత్రే జేయమా ! దైవమా!

మ. శివరాత్రిన్ భవ! జాగరంబు నిశ, నిన్ జింతించుచున్ భక్తి జే
య, వెలిన్ జేసెదవీ వశాంతి ననుచున్ ధ్యానింతురే గాని! ఓ
ధవళాంగా! మతదుర్మదాంధులు కడున్ దౌష్ట్యంబుతో సల్పు క్రూ
ర, విధుల్ మాన్పగ వెండికొండ విభు! నేత్రాల్ నిన్ గనన్ మానునే!
శా. శ్రీలింగోద్భవ దర్శనంబునను, దూరీ భూత మై పాపముల్
గ్రాలున్ బుణ్యములందు నంచు దలతుర్ గానీ! శివా!హింసయే
కేళిన్ మానవబాంబు పేర సలుపున్ గ్రీడావిధం బాపినన్
జాలో! పార్వతి వల్లభా! యెదభవత్సందర్శనోత్సాహి!

ఉ. నీ యభిషేక పాళియను నిత్యము జేయ మానసంబులే
లో యనురాగ పూరితములున్ ! భవ!కావె! జిహాదటంచు క్ష్మా
నే యొనరించు ఘాతుకములే ! విని వారణ సల్పి సన్మతిన్
నీ యురు సత్కృపాజలధినే వెసగూర్పగ ! చంద్రశేఖరా!

రాయప్రోలు సీతారామశర్మ 9701764878