నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఆ యతుల పుణ్యునకు నన
సూయసరకుఁబరీక్షిదగ్రసుతునకు వైశం
పాయనుఁడనంత పుణ్యఫ
లాయత్తము గాఁగఁ జెప్పినని కడుఁ బ్రీతిన్
భావం: సాటి లేని పుణ్యం కలవాడున్నూ, ఈర్ష్యారహితుడున్నూ, పరీక్షిన్మహారాజు జ్యేష్ఠకుమారుడున్నూ అయిన జనమేజయుడికి వైశంపాయనుడు అంతం లేని పుణ్యం యొక్క ఫలానికి ఆధీనవౌనట్లుగా మిక్కిలి ప్రీతితో చెప్పాడని సౌతి శౌనకాదిమహర్షులకు తెలిపాడు
క. వీర శ్రీవనితాశ్రీత
భూరిస్థిత బాహుదండ బుధనుత సుగుణా
ధార! కలియుగ పవిత్ర పు
రారాతి పదాబ్జ పూజనాసక్తమతీ!
భావం: వీరలక్ష్మి అనే కాంత చేత ఆశ్రయించబడిన విశాలాలు , దృఢాలు నైన దండాల వంటి బాహువులు కలవాడా! పండితుల చేత పొగడబడిన మంచిగుణాలకు ఆశ్రయ మైన వాడా! కలియుగాన్ని పవిత్రీకించేవాడా! త్రిపుర వైరి యైన శివుడి పాదపద్మాలందు ఆసక్తి గల మనస్సు కలిగిన వాడా రాజరాజా!

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము