నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా. ఆ దుష్యంతుఁపనంతసత్త్వుడు సమస్తాశాంతమాతంగ మ
ర్యాదాలంకృత మైన భూవలయ మత్మాయత్త మై యుండఁగా
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
నాదిక్షత్ర చరిత్ర నేలె నజితుండై బాహు వీర్యంబునన్

భావం: అనంతమైన బలం కలిగిన ఆ దుష్యంతుడు అన్ని దిక్కుల చివరలలో గల యేనుగులను (అష్టదిగ్గజాలు) సరిహద్దుగా ఒప్పిన భూమండలం తనకు అధీనమై ఉండగా, సూర్య కిరణాలకున్నూ వాయువుకున్నూ ప్రవేశింప రానట్టి భయంకరాలైన అడవి ప్రదేశాలతో పాటుగా పూర్వ రాజుల వర్తన వంటి వర్తనంతో భుజబలంతో, ఓడనివాడై భూమిని పరిపాలించాడు. అతని పూర్వుల చరిత్రను మనసున ఉంచుకుని ధర్మాచరణలో ముందుకు పోతూ రాజ్యప్రజలను కంటికి రెప్పల్లాగా చూసుకునే వాడుగా మహారాజుగా దుష్యంతుడు పేరుగాంచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము