నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. సరభస పరిచరిత మహా
శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద
ద్విరదాది ప్రకర భయం
కరవన మధ్యమున నృపతి గడుఁ గడిమి మెయిన్

భావం: తొందరగా తిరుగుతున్న మహాశరభాలు, సింహాలు, పందులు, పెద్ద పులులు, మదపు టేనుగులు మొదలైన జంతు సమూహాలతో భయంకరమైన ఆ అరణ్య మధ్య ప్రాంతంలోదుష్యంతుడు పరాక్రమంతో వేటాడడం ప్రారంభించాడు. వాని ధాటికి తట్టుకోలేక రాజ పరివారం మిక్కిలిగా అలసి పోవడం ప్రారంభించింది. దుష్యంతుడు మితి మీరిన ఉత్సాహంతోను, అలవికాని పరాక్రమంతోను అడవి మృగాలను వేటాడుతున్నాడు. అడవి పందులలాంటివాటిని మరింత ఉత్సాహంతో తరుము తున్నాడు. రాజు గారి వేగానికి అవి మరింతగా తప్పించుకోవాలనే ఆరాటంతో అవీ వేగంగా పరుగెత్తుతున్నాయ.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము