నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కాఱడవిఁ బఱచు మృగముల
నూఱడకం దిగిచి డస్సి యున్నతని శ్రమం
బాఱఁగ నెడఁ బరితాపము
దీఱఁగ ఁ బైవీచె నన్న దీపవనంబుల్
భావం: దట్టమైన అడవిలో పరుగెత్తే మృగాలకు విరామం లేకుండా వెంటాడి వేటాడటం చేత అలసి యున్న దుష్యంతుడి బడలిక తీరేటట్లు మనసులోని తాపం తగ్గేట్లు ఆ నది మీద నుండి వచ్చే చల్లని గాలులు అతనిపై వీచాయి. దుష్యంతుడు వేట పై మక్కువతో తన పురోహితులు, మంత్రులు, స్నేహితులతో కలసి వెళ్లి అడవి పందులను క్రూర మృగాలను అలవక చాలాసేపు వేటాడాడు. వాటిని పట్టువదలకుండా ఎంతో సేపు వేటాడగా దుష్యంతుడుచాలా అలసి పోయాడు. ఆయనతో పాటుగా రాజపరివారం అంతా కూడా అలసి పోయింది. వారి గుర్రాలు ఏనుగులు కూడా అలసి కూర్చునిపోగా దుష్యంతుడు కొంతమంది మంత్రులు, పురోహితులతో కలసికాస్త దూరం ముందుకు పోగా అక్కడ ఆయనకు కంటికి ఆహ్లాదాన్ని మనసుకు హాయినిచ్చే ఓ ఆశ్రమం కనిపించింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము