నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ఉత్తమాశ్రమ ని ష్ఠితుఁ దూర్థ్వ రేతుఁ
డైన కణ్వ మహాముని యనఘ చరితుఁ
డట్టిముని కెట్లుఁ గూతుర వైతి? దీని
నెఱుఁగంగఁ జెప్పుము నలిన నేత్ర
భావం: పద్మ నేత్రవైన ఓ శకుంతలా! చతుర్విధాశ్రమాలలో ఉత్తమమమైన సన్న్యాసాశ్రమాన్ని నిష్ఠతో పాటించిన వాడున్నూ , ఇంద్రియ నిగ్రహం కలవాడున్నూ అయిన కణ్వమహర్షి కళంకం లేని చరిత్ర కలవాడు. అటువంటి ఆ మునికి నీవెట్లా కూతురవైనావు? ఆ సంగతి నాకు తెలియచెప్పుము. అని దుష్యంతుడు దాహార్తిని తీర్చుకుని కాసేపు సేద దీరుదామని వచ్చి నిలిచి కణ్వమహాముని ఆశ్రమం లో లేడని తెలుసుకొన్న దుష్యంతుని అక్కడ తనకు దాహార్తిని తీర్చి యోగక్షేమాలు అడిగిన మునికన్యనుచూచి ఈ విధంగా అడిగాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము