నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అనఘుఁడు రాజర్షియై తన శ్శక్తిమై బ్రహ్మర్షిభావంబుఁ బడసియున్న
సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర తపము సేయుచునున్నఁ దత్తవమున
కెంతయు వెఱచి దేవేశ్వరు డప్పరో గణములతో నగ్రగణ్యయైన
దాని మేనక యను ధవళాక్షిఁ బిలిచి ‘విశ్వామిత్రుపాలికి ఁ జని తదీయ
ఆ. ఘోరతపము చెఱచి కోమలి
నాదైన దేవ రాజ్యమహిమఁ దివిరి నీవు
గావు’ మనిన నదియుఁ గడు భయంపడి యమ
రేశ్వరునకు మ్రొక్కి యిట్టు లనియె
భావం: రాజర్షియై తపశ్శక్తితో బ్రహ్మర్షి పొందియున్న పుణ్యాత్ముడు . మునిశ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు అత్యంత భయంకరమైన తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సుకు మిక్కి లి భయపడి దేవేంద్రుడు అప్సరోగణాలలో ఉత్తమురాలైన మేనకను పిలిపించి ‘ఓ కోమలీ! నీవు ఆ విశ్వామిత్రుడి దగ్గరకు పోయి అతని భయంకర తపస్సును ఏ యత్నంతో నైనా భగ్నం చేసి నా స్వర్గ రాజ్య గౌరవాన్ని నీవు రక్షించాలి’ అని పల్కగా మేనక అందుకు భయపడి ఇంద్రుడికి మ్రొక్కి ఈ విధంగా అన్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము