నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. చల్లని దక్షిణ మారుత
మల్లన వీతెంచెఁ దగిలి యా లలనాధ
మ్మిల్ల కుసుమాంగరాగన
ముల్లస నసుగంధి యగుచు ముని వరుమీఁడన్
భావం: దక్షిణ దిక్కునుండి వీచె చల్లని మలయయానిలం ఆమేనక కొప్పులోకి పూల వాసనల చేతను ఆమెమైపూతల సుగంధాల చేతను అమితంగా పరిమళిస్తూ ఆ మునిశ్రేష్ఠుమైన విశ్వామిత్రుడు మేనిపై విడవకుండా వీచింది. తాను విశ్వామిత్రుని దగ్గరకు వెళ్లడం అంటే ఎంత భయంకరమో చెప్పినప్పటికీ మేనకు తిరిగి దేవేంద్రుని ప్రోద్భలంతో విశ్వామిత్రుడు తపస్సు చేసుకొంటున్న హిమవత్పర్వతాల దగ్గరకు వెళ్లింది. ఆమె వెంట మలయ మారుతం కూడా వెంట వచ్చింది. అలా ఆ మేనక వెంట వచ్చే పిల్లగాలి ఆమె మేను పరిమళాన్ని ఆమె కొప్పులోని పూల పరిమళాన్ని కూడా తనతో కలుపుకుని హిమవత్పర్వతాలపై వెదజల్లుతోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము