నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అనిమిషకాంతయున్ నవ లతాంత విభూషణ లీల నల్లన
ల్లన వనకేళి లాలన విలాసగతిం జనుదెంచి ముండటం
గనియె మహామునిప్రవరుఁ గౌశికుఁ గౌశిక చిత్తు భీతి సం
జనన మహాతవ శ్చరణ సంయత చిత్తు నిరస్తచిత్తజున్
భావం: దేవకాంత అయిన మేనక క్రొత్తవైన పూల అలంకారాల విలాసంతో మెల్లమెల్లగా వనంలో విహరించే కోరికతో కులుకుతూ నడుస్తూ వచ్చి తనముందట మహామునులలో శ్రేష్ఠుడున్నూ ఇంద్రుడి మనస్సులో భయం పుట్టించే గొప్ప తపస్సు చేయడంలో నియతమైన మనస్సు కలవాడున్నూ మన్మథభావాన్ని జయించిన వాడున్నూ అయిన విశ్వామిత్రుడిని చూచింది. దేవేంద్రుడి చేత ప్రేరేపించబడి విశ్వామిత్రుని తపోభంగం చేయడానికి వచ్చిన మేనక మనసులోఅలజడి నొందుతున్నా దేవేంద్రుని ఆజ్ఞ కాదనలేక విశ్వామిత్రుని తపోభూమికి వచ్చింది. నిశ్చలంగా నిర్మలంగా తపస్సుచేసుకొంటున్న ఆ మహర్షిని తదేకంగాచూచింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము