నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. ఇది ముని నాథ కన్యయేని యెంతయు నిస్పృహవృత్తి నున్న నా
హృదయము రాజపుత్రి వని యిక్కమలాక్షి నిజాభిదాత్య సం
పద నెఱిఁగించినన్ మదన బాణ పరంపర కిప్పు డుండ నా
స్పద మయి సంచలించె నళిపాత వికంపెత పంకజాకృతిన్
భావం: శకుంతల ముని కన్య యేమో అని మిక్కిలి నిరాశచెందుతోన్న నా హృదయం ఈ పద్మాక్షి తాను రాజపుత్త్రినని తన వంశౌన్నత్యాన్ని తెలవటం చేత మన్మథ బాణ పరంపరను వశమై తుమ్మెదలు వాలటం చేత కంపించిన పద్మం వలె చలించింది అని మనసును శాంతపరుచుకున్నాడు దుష్యంతుడు. ముని ఆశ్రమంలో తనతో మాట్లాడిన శకుంతలను చూచి ప్రేమను పెంచుకున్న దుష్యంతుడు తాను వలచిన కన్య మునికన్య కాదని తెలుసుకొన్న దుష్యంతుడు ఆనంద చిత్తంతో తనను దైవం అనుగ్రహించాడని అనుకొన్నాడు. దాను రాజపుత్రినే వలచాడని తెలుసుకొన్న దుష్యంతుని మనసు తేలికపడింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము