నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాక్కర
ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమ విషనహ్ని
సురగంబు లేర్చుచు నునికి కలిగి పయోరుహగర్భుఁ
డురగవిషాపేత జీవ సంజీవనోపదేశంబు
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిల లోకహితంబు పొంటె

భావం: భూమిలో స్థావర జంగమ వస్తుసముదాయాన్ని తమ విషాగ్ని చేత పాములు కాల్చి వేస్తుండటం వలన కోపించి బ్రహ్మదేవుడు సర్వలోకాల మేలు కోరి పాముల విషం చేత ప్రాణం పోయిన వారిని మళ్లీ జీవింపచేసే మంత్రోపదేశాన్నిదయతో కశ్యపునకు ఇచ్చాడు. శృంగి ఇచ్చిన శాపాన్ని తెలుసుకొన్న పరీక్షిత్తు కేవలం ఆజ్ఞాపించడం చేతనే విషాన్ని పొగొట్టసమర్థులైన విషవైద్యులను దగ్గరనే పెట్టుకొని ఉన్నాడు. తక్షకుడనువిషసర్పము వలన ఏవిధంగా పరీక్షిత్తును చేరుతాడా అని అందరూ చూస్తున్నారు. మరొక చోట బ్రహ్మదేవుడు కశ్యపునకు చనిపోయిన వారిని తిరిగి బతికించుటకుగాను మృతసంజీవిని ఇచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము