నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. తలఁపగ నాఁడు పల్కిన విధం బెటఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నైరని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియులైన ధరాధినాథులన్

భావం: ఆలోచించగా , ఈరోజు పెండ్లి నాడు పలికిన పద్ధతిని మనసు మార్చుకొని వదిలిపెట్టినాడా? ఏమి? అతని చూపులు నాయెడ విరసంగా, అత్యంత కఠినంగా ఉన్నవి. కారణమేటో ? కొత్త కొత్త వాటినే ప్రేమించే రాజులను కలుపుగోలుతనంతో పల్కరించారనీ ఉపకారులై వ్యవహరించారనీ బుద్ధి మంతులు వారిని నమ్మి ఉండరాదు శకుంతల తననుదుష్యంతుడు ఆదరించట్లేదని అనుకొంటూ దీనికి కారణం రాజులు అన్యమనస్కులై ఉండడమో లేక అనేక విధాలైన వ్యవహర్తలు గా ఉంటారు కూడా కనుక తన్ను మరిచిపోయ ఉంటారేమో అని ఆందోళనమనసుతో అనుకొంటున్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము