నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. విమలయశోనిధి! పురుషవృత్త మెఱుంగుచునుండు ఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు సహంబును రాత్రియు న న్మహాపదా
ర్థము లివి యుండగా నరుఁడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్

భావం: నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడైన దుష్యంతుడా! వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, హృదయం, యముడు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి - అనే మహాపదార్థాలు నరుల వర్తనాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయిసుమా. ఆ మహాపదార్థాలు ఉండగా నరుడు తనంతట తాను వంచించుకోగలడా? సత్యాన్ని దాచుకొన గలడా? లేదా తాను చేసిన దానిని దాచుకొనలేడు గదా?
శకుంతలను తనకు తెలియదనే దుష్యంతుని చూచి శకుంతల నివ్వెర పడి ఖేదంతో దుష్యంతునితో ఎవరూ చూడలేదని అబద్ధం ఎలా చెప్పగలను ప్రకృతిసాక్షిగా నీవు నన్ను పెండ్లాడావని తెలియచేయడానికి ఈ విధంగా మాట్లాడింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము