నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. నా యెఱిఁగినట్ల యిన్నియు
నీ యిచ్చిన వరము ధారుణీ వర యెఱుఁగున్
నాయందు ఁ దొంటి యట్టుల
చేయు మను గ్రహ మవజ్ఞ సేయం దగునే!
భావం: ఓ రాజా! నీ విచ్చిన వరాన్ని గురించి నా కెట్లా తెలియునో ఆ విధంగానే వేదాలు మొదలైన మహాపదార్థాలకు కూడా తెలియును. కాబట్టి నా పట్ల వెనుకటి వలెనే అనురాగాన్ని ప్రసాదించుము. నన్ను అవమానించటంతగునా? తగదని శకుంతల చెప్తోంది.
క. సతియును గుణవతియుఁ బ్రజా
పతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్విత దృష్టి ఁ జూచు నతి దు
ర్మతి కిహముం బరము ఁ గలదె మతిఁ బరికింపన్
భావం: బుద్ధితో బాగా పరిశీలిస్తే పతివ్రత, గుణవంతురాలు , సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూచే మిక్కిలి దుర్బుద్ధికి ఇహపరసుఖాలు రెండూ ఉంటాయా? అంటే అబద్ధం ఆడితే చేతిలోనున్న సుఖాలు దూరమవుతాయని భావం .

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము