నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. సంతత గృహమేధి ఫలం
బంతయుంగ నోపు సమగుణ భార్యా
నంతుండగువాఁడు క్రియా
వంతుఁడు దాంతుండుఁ బుత్రవంతుండు నగున్
భావం: అనుకూలవతి ఐన భార్య గలవాడు, కర్మలు ఆచరించగలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడు. పుత్ర సంతానం పొందగలుగుతాడు. గార్హస్థ్య ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్నంతటినీ అందుకొన గలుగుతాడు. భార్యాభర్తలు కలసి ఉంటే ధర్మాచరణకు ఎటువంటి ఆటంకము కలుగదు. భర్త చేసే ధర్మబద్ధమైన పనులకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నింటా సహకరించే భార్యలభించడం పూర్వ జన్మపు ణ్యంగా భావిస్తారు కనుక దుష్యంతుడు శకుంతలను గాంధర్వవిధిన వివాహమాడి కూడా తనకు తెలియదని చెప్పడంలో బాధను భరించలేక శకుంతల భార్యభర్తలు సంసార చక్రానికి ఎంత అవసరమో చెప్తోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము