అమృత వర్షిణి

మీలో సృజనాత్మకత ఎక్కువగానే ఉంటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఐడియాలు ఇవ్వగల్గిన వారికి బిజినెస్‌లో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తెలివితేటల్లో తీసిపోని వారిలో కూడా కొత్త ఐడియాలు ఇవ్వగల్గిన వారికి కంపెనీలలో జీతాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి.
పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి సృజనాత్మక సామర్థ్యం ఉంటుంది. శరీరంలోని ఏ భాగాన్నైనా వినియోగించుకోకపోతే ఏ విధంగా అది బలహీనపడి పోతుందో అదే విధంగా ఈ సృజనాత్మక శక్తిని వినియోగించుకోకపోతే క్రమక్రమంగా అది మరుగున పడిపోతుంది.
సృజనాత్మకత అనేది ఏదో కొంతమంది మేధావుల సొంతం కాదు. ఈ పవర్ ప్రతి ఒక్కరి ఆస్తి. ప్రతి ఒక్కరి చెవుల మధ్య ఒక బంగారు గని ఉంటుంది.
కొంతమంది సాధారణ మెకానిక్‌ల పనితీరు విశే్లషించినపుడు వారిలో మూడింట రెండు వంతుల మంది సాధారణ స్థాయికి మించి సృజనాత్మక శక్తిగల వారుగా వున్నట్లుగా గుర్తించారు. అంటే సేల్స్‌మెన్, అడ్వర్టయిజింగ్ మనుషులు, ఇంకా సృజనాత్మకతను వినియోగించే ఉద్యోగాలలో వున్నవారు నిరంతరం ప్రయత్నాలతో వారిలోని సృజనాత్మకతను అభివృద్ధి చెందించుకుంటూ ఉంటారు.
జీవితంలో విజయాలు సాధించిన వారెందరో జీవితం పొడవునా కొత్తకొత్త ఐడియాలను కలలు గంటూ గడిపినవారే. ఒక న్యూస్ రిపోర్టర్ తాను రాసిన వార్తా కథనాలను పేరెన్నికగన్న ఒక పత్రిక ఎడిటర్‌కు చూపించాడు. ఆ ఎడిటర్ ఆ వార్తాకథనాలు చూశాడు. ‘మా రిపోర్టర్స్ కూడా కథనాలు ఇలాగే రాస్తారు. కాకపోతే నీవు రాసిన ప్రతి కథనంలోనూ ఒక కొత్త ఐడియాను ప్రవేశపెడుతున్నావు. మావాళ్లు వార్తా కథనాలు వృత్తిపరంగా రాస్తున్నారు కాని కొత్త ఐడియాలను ఉంచాలనే ధోరణితో రాయడం లేదు. అందుచేత నీకు ఉద్యోగం ఇస్తాను’ అన్నాడు.
ఉద్యోగం సులువుగా వస్తుంది!
కొన్ని మంచి ఐడియాలతో గలవారు సులువుగా ఉద్యోగం సంపాదించుకో గల్గుతారు. ఎలెక్స్ ఓస్ బోరన్ అనే ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీలోని ఉద్యోగి ప్రతిరోజు ఒక కొత్త ఐడియాను ఆలోచించి ఉపయోగించుకునేవాడు.
ఈ కారణంగానే అతడు అనేక పదోన్నతులు పొందడమేగాక, స్నేహితులను సంపాదించుకుని ఒక యధార్థ నాయకుడిగా తయారయ్యాడు. చివరకు అతడు పనిచేసే కంపెనీకి హెడ్‌గా అయ్యాడు. అతనికింద వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసేవారు.
నిరంతర ప్రయత్నాలవల్లనే కొత్తకొత్త ఐడియాలు తనకు వచ్చేవని ఆ కారణంగానే తనకు కంపెనీలో ప్రాముఖ్యత పెరిగిందని అతడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన వద్ద పనిచేసే ఉద్యోగులు కొత్తకొత్త ఐడియాలు ఏ విధంగా తాము సృష్టించుకుని కంపెనీకి సహాయపడగలరో తరచువారికి తెలియజేస్తూ ప్రోత్సహించేవాడు.
మీరు కూడా మీలోని నిద్రాణ స్థితిలో వున్న సృజనాత్మకతను తట్టి లేపుకోవాలి. శతాబ్దాలుగా సృజనాత్మకంగా ఆలోచించేవారు ఏ విధమైన విధానాలు అవలంబించేవారో కొన్నింటిని తెలుసుకుందాం.
మీ ఖాళీ సమయాలు పిల్లలతో గడపాలి!
మీ పిల్లలతోనే మీరు గడుపుతూ వారి సంభాషణలు, చర్చలు వినండి. వారు ప్రతి విషయాన్ని కొత్త కోణంలో చూస్తారు. దేనిని ‘ఇంతే’ అని పరిగణించరు. ‘ఆకాశం నీలంగా ఎందుకు ఉంది?’ ‘పెన్సిల్‌కు ఇరేజర్స్ వున్నట్లు పెన్నులకు ఎందుకు లేవు?’ వంటి ప్రశ్నలు మీ ముందు ఉంచుతారు. ఈ ప్రశ్నలు మీ ఊహలకు మంచి మానసిక వ్యాయామాన్ని కలుగజేస్తాయి.
ఎనిమిదేళ్ల కూతురు బెడ్‌రూమ్‌లో లైటు ఆర్పకుండా వంటగదిలోకి వెళ్లింది. ‘బెడ్‌రూమ్‌లో లైటు ఆర్పలేదు. వచ్చి ఆర్పు’ అన్నాడు తండ్రి.
‘వంటగదిలో కూర్చుని బెడ్‌రూమ్‌లో లైటు ఆర్పే సౌకర్యం ఉంటే ఒక అద్భుతం అవుతుంది కదా! డాడీ’ అంది ఆ అమ్మాయి.
ఆ కూతురు ఆలోచన తండ్రిలో సరికొత్త ఐడియాకు నాంది పలికింది. ఫలితంగా తండ్రి ఆలోచించి ఒక టచ్ ప్లేటు తయారుచేశాడు. ఆ తరువాత దానిలో దీపాలను ఇంటా బయట కంట్రోల్ చేయగల మూడు మాస్టర్ కంట్రోల్స్ అమర్చాడు. ఆ తండ్రి పేరే విలియం బ్యూక్‌వే. ఈ సరికొత్త పరిశోధన అతనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు మరియు ధనం సంపాదించి పెట్టింది.
నివారణ మార్గాలు అనే్వషించాలి
ఒక సమస్యకు పరిష్కార దిశగా ఏది కావాలో గమనించే సామర్థ్యం నిత్య జీవితంలో ఏయే లోపాలు విజయానికి దోహదం చేస్తున్నాయో తెలుసుకోవడమేగాక వాటి నివారణకు మార్గాలు అనే్వషించుకుంటే సమయం, ధనం ఆదా అవుతాయి. విజేతలుగా దర్శనం ఇస్తారు.
చేరువ కావాలి!
సెలవులు, ఖాళీ సమయాల్లో కొత్త ప్రదేశాలకు వెళ్లాలి. మనకు సమీపంలో ఉన్న వాటినే నిశిత దృష్టితో చూడం. వజ్రాలకోసం వేలాది మైళ్లు ప్రయాణం చేస్తారు కాని కాలి కింద వున్న వాటిని గుర్తించి భూమిని తవ్వి తీసుకోము.
అదేవిధంగా కొత్త ఐడియాలు మీరు వున్న ప్రాంతంలోనే వస్తాయి. ఎందుకంటే అవి మనలోనే ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు, కొత్త శబ్దాలు విన్నపుడు కొత్తకొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. మనసు తాజాగా ఉండి ఇటువంటి ఐడియాలకు కేంద్రం అవుతుంది. ఎప్పుడూ ఒకేచోట ఉంటే మనసుకు ‘బోర్’ అన్పించవచ్చు. అందుకే కొత్త ప్రదేశాలు సందర్శిస్తే ‘ఐడియాలు’ సరికొత్తవి రావచ్చు.

-సి.వి.సర్వేశ్వరశర్మ