రుచి

విభిన్న రుచుల న్యూ ఇయర్ కేక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. వివిధ ఆకృతుల్లో, విభిన్న రుచులను అందించే కేకులను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. నూతన వత్సరంలో ప్రతిరోజూ మధురంగా గడిచిపోవాలని ఆకాంక్షిస్తూ తియ్యటి కేకులతో సంబరాలు చేసుకుంటారు. నోరూరించే కేకులను తినాలని పిల్లలే కాదు, పెద్దలు సైతం ఆరాటపడుతుంటారు. దుకాణాల్లో భారీ ధరలకు కేకులను కొనే బదులు మనకు నచ్చిన రుచులను ఆస్వాదించేలా ఇంట్లోనే సొంతంగా కేకులను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన కేకులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే వేడుకలు మరింత వైవిధ్య భరితంగా ఉంటాయి. హార్లిక్స్ కేక్, చాకొలెట్ ఐస్‌క్రీమ్ కేక్, క్యారెట్ కేక్, ఖర్జూరం కేక్, కొబ్బరి కప్ కేక్, ఫ్రిజ్ కేక్, పైనాపిల్ కేక్, లెమన్ కేక్ వంటివి మనం సులభంగా చేసుకోవచ్చు. ‘ఎగ్’ ఇష్టపడని వారు దాన్ని వినియోగించకుండానే రుచికరమైన కేకులు చేసుకోవచ్చు. యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, వెనిల్లా, కాఫీ, కోక్, హార్లిక్స్, చాక్‌లెట్, చీజ్, ఐస్‌క్రీమ్‌లను బయట కొనుక్కొని విభిన్న రుచుల కేకులను తయారు చేసుకుంటే ఆ ఆనందమే వేరు. కేకులు తయారు చేసేందుకు అవసరమయ్యే చిన్న చిన్న పరికరాలు మార్కెట్‌లో లభిస్తాయి. ఎలెక్ట్రిక్ ఓవెన్ లేనివాళ్ళు సాధారణ ఓవెన్‌ను వాడవచ్చు. విజిల్, గ్యాస్‌కట్ అవసరం లేకుండా కుక్కర్‌లో నీళ్ళు పొయ్యకుండా గినె్నలో పదార్థాలు వేసి వీటిని చేసుకోవచ్చు.

హార్లిక్స్ కేక్

మైదా - 2 కప్పులు
పంచదార - 1 1/2 కప్పు
జీడిపప్పు - 24
బాదం పప్పు - 24
కిస్‌మిస్ - 24
వెన్న - 3 కప్పులు
బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు
హార్లిక్స్ పౌడర్ - 1 కప్పు
వెనిల్లా ఎసెన్స్ - 6 చుక్కలు
పాలు - 1 కప్పు
ఎండుకొబ్బరి - 2 చెంచాలు
గుడ్లు - 2
యాలకులు - 12
చెర్రీలు - 24
ఫ్రూటీ క్రూటీ - 24

బేకింగ్ పౌడర్, మై దాపిండి, పంచదారను గిలక్కొట్టిన ఎగ్ మిశ్రమంలో కలుపుకోవాలి. వెన్నలో సగం వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో వెన్న రాసి, అందులో పై మిశ్రమాన్ని పోసి జీడిపప్పు,యాలకుల పొడి, కొబ్బరి కోరు, కిస్‌మిస్ కలిపి కుక్కర్‌లో పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికి కమ్మటి వాసన వస్తుండగా దింపి ట్రేలో పెట్టాలి. మిగిలిన వెన్నలో అరకప్పు పంచదార వేసి బాగా కలిపి దాన్ని పైన చేసుకున్న కేక్ పైభాగంపై సర్దాలి. దీనిపై చెర్రీలు, ఫ్రూటీ క్రూటీ ముక్కలను అలంకరించాలి.

చాకొలెట్ కేక్

మైదా - 2 కప్పులు
పంచదార - 1 1/2 కప్పులు
వెన్న - 1 1/2 కప్పు
కోక్ పౌడర్ - 1 కప్పు
వెనిల్లా ఐస్‌క్రీమ్ - 4 కప్పులు
ద్రాక్షపళ్ళు - 24
చెర్రీలు - 24
వెనిల్లా ఎసెన్స్ - 6 చుక్కలు
బేకింగ్ పౌడర్ - 3 చెంచాలు
పెరుగు - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
వేరుశెనగపప్పు - 1 కప్పు

మైదాపిండి, పంచదార, వెన్న, కోక్, అరకప్పు నెయ్యి, పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి. మిగిలిన పంచదార, నెయ్యి బాగా కలిపి విడిగా ఉంచాలి. గినె్నలో నెయ్యి రాసి ఈ మిశ్రమం పోసి కుక్కర్‌లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. చల్లారాక దీన్ని సగానికి కోసి, కేకు ముక్కలపై వేరుశెనగ పప్పు, ఎండు ద్రాక్ష సర్ది ఐస్‌క్రీమ్‌తో మధ్యభాగం నింపాలి. దీనిపైన మరో కేకు ముక్కపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. గంట తర్వాత దీన్ని సెర్వ్ చేసేముందు చెర్రీలు, జీడిపప్పుతో అలంకరించాలి.

క్యారెట్ కేక్

క్యారెట్ కోరు - 2 కప్పులు
కొబ్బరి కోరు - 2 కప్పులు
దాల్చిన చెక్క, యాలకులు,
లవంగాల పొడి - 4 చెంచాలు
జీలకఱ్ఱ పొడి - 1 చెంచా
పెరుగు - 2 కప్పులు
డాల్టా - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
కుంకుమ పువ్వు - 2 చెంచాలు
మైదా - 4 కప్పులు
బేకింగ్ పౌడర్ - 6 చెంచాలు
ఉప్పు - చిటికెడు
పంచదార - 4 కప్పులు
ఐస్‌క్రీమ్ - 2 కప్పులు
స్ట్రాబెర్రీ పళ్ళు - 12

ముందుగా మైదా, పెరుగు, నెయ్యి బాగా కలిపి ఉప్పు, బేకింగ్ పౌడర్, ఇతర సుగంధ ద్రవ్యాలను జత చేయాలి. నెయ్యి రాసిన గినె్నలో ఈ మిశ్రమాన్ని వేసి, దానిపై క్యారెట్ కోరు చల్లి, మీద మరో పొరలా మిశ్రమాన్ని సర్దాలి. ఇది కుక్కర్‌లో బాగా ఉడికిన తర్వాత పైన మరికాస్త కొబ్బరి కోరు, కుంకుమ పువ్వు, ఐస్‌క్రీమ్ వేసి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి.

కొబ్బరి కప్ కేక్

మైదా - 6 కప్పులు
బేకింగ్ పౌడర్ - 2 టి.స్పూన్లు
వంట సోడా- 1 టి.స్పూన్
ఉప్పు - 1 టి. స్పూన్
పంచదార - 4 కప్పులు
వెన్న - ఒకటిన్నర కప్పులు
గుడ్లు - 6
కొబ్బరి కోరు- 5 కప్పులు
మజ్జిగ - 2 కప్పులు
ఐస్ కోసం:
క్రీమ్ చీజ్ - అర కిలో
వెన్న - 1 కప్పు
వెనీలా, బాదం ఎసెన్స్- 3 టి. స్పూన్లు
ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార, వంట సోడాను మజ్జిగలో వేసి గుడ్లను గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో లేదా కుక్కర్‌లో ఉంచి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక ఈ మిశ్రమంపై కొబ్బరి కోరు, ఐస్ క్రీమ్‌ను అంతటా సర్ది కప్పుల్లో వేసి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచాలి.

ఖర్జూరం కేక్

ఎండు ఖర్జూరం - 4 కప్పులు
మైదా - 1 కప్పు
రస్కుల పొడి - 1 కప్పు
బిస్కెట్స్ పొడి - 2 కప్పులు
నెయ్యి - 1 కప్పు
బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు
చీజ్ ముక్కలు - 4
బాదం పప్పు - 24
చెర్రీ ముక్కలు - 24
ఐస్‌క్రీమ్ - 4 కప్పులు
ఎండుద్రాక్ష - 24
పెరుగు - 1 కప్పు

ఎండు ఖర్జూరం ముక్కలు, మైదా, రస్కుల పొడి, బిస్కెట్స్ పొడి, నెయ్యి, బేకింగ్ పౌడర్‌ను పెరుగులో వేసి బాగా గిలక్కొట్టాలి. గినె్నలోపల నెయ్యి రాసి ఈ మిశ్రమం పోసి కుక్కర్‌లో ఉడికించాలి. చల్లారాక బయటకు తీసి చెర్రీ ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదం ముక్కలను పైన సర్దాక, అంచుల వరకూ ఐస్‌క్రీమ్ వేయాలి. దీన్ని గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాక తీసి సర్వ్ చేయవచ్చు.

-శ్రీచందన