జాతీయ వార్తలు

పారిస్ ఒప్పందాన్ని ఆమోదించనున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం అమలులోకి రావడానికి మార్గం సుగమం అయింది. భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఆమోదించాలని బుధవారం నిర్ణయించింది. అయితే మహాత్మా గాంధీ జన్మదినోత్సవమైన అక్టోబర్ రెండో తేదీన కేంద్ర మంత్రివర్గం దీన్ని లాంఛనంగా ఆమోదిస్తుంది. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకాశ్ జవదేకర్ ఇక్కడ విలేఖరులకు వెల్లడించారు. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని రోజులకే కేంద్ర మంత్రివర్గం ఈ ఒప్పందాన్ని ఆమోదించాలని నిర్ణయం తీసుకుంది. భూతాపాన్ని నియంత్రించడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలను అమలు చేసేందుకు భారత్ ఈ ఒప్పందాన్ని ఆమోదించడం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమలు చేయడంలో భారత్ కీలకంగా ఉంటుందని మంత్రి జవదేకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తగిన విధంగా స్పందించడానికి భారత దేశ నాయకత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం అమలులోకి రావడానికి రెండు నిబంధనలు ఉన్నాయని జవదేకర్ చెప్పారు. ఒకటి.. కనీసం 55 దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే 61 దేశాలు దీన్ని ఆమోదించాయని ఆయన తెలపారు. 2016-2020 మధ్య గల నాలుగు సంవత్సరాల కాలం కూడా ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయంలో భారత్ కీలక పాత్రను పోషించిందని, ఇప్పుడు ఎంతో ముఖ్యమైన 2020కు ముందు తీసుకోవలసిన చర్యల గురించి ప్రపంచ సమాజానికి గుర్తు చేస్తుందని జవదేకర్ అన్నారు. మహాత్మాగాంధీ జన్మదినోత్సవమైన అక్టోబర్ 2న పారిస్ వాతావరణ ఒప్పందాన్ని భారత్ ఆమోదిస్తుందనే విషయాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజయిన బుధవారం తాను ప్రకటిస్తున్నానని జవదేకర్ తెలిపారు.

బంగ్లాలో దుర్గామాత విగ్రహాలు ధ్వంసం

ఢాకా, సెప్టెంబర్ 28: బంగ్లాదేశ్‌లో హిందువుల దేవత దుర్గామాత విగ్రహాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హబిగంజ్ జిల్లా ఫుతర్‌మతి గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దేశ రాజధానికి 170 కిలోమీటర్ల దూరంలో ఫుతర్‌మతి ఉంది. హిందువుల ఆరాధ్య దైవం దుర్గామాత. శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లకు వారంతా సిద్ధమవుతున్న తరుణంలో దుర్గమ్మ విగ్రహాలు ధ్వంసం కావడం ఆ వర్గం ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. గ్రామంలో విగ్రహాలు తయారీపై స్థానిక యువకులు కొందరు ఘర్షణకు దిగారని పోలీసులు తెలిపారు. దీంతో కొందరు వ్యక్తులు దుర్గామాత విగ్రహాలు ధ్వంసం చేసినట్టు ఢాకా ట్రిబ్యున్ వెల్లడించింది. విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వారు తెలిపారు. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్‌లోని కొన్నిచోట్ల హిందువులు శరన్నవరాత్రి వేడుకులు జరుపుకొంటారు.