రాష్ట్రీయం

10న ‘నిధి ఆప్కా నికత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఎఫ్ సమస్యల పరిష్కారానికి వేదిక * ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 21: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు డిసెంబర్ 10వ తేదీన ‘నిధి ఆప్కా నికత్’ పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఇటువంటి సమావేశాన్ని భవిష్యనిథి అదాలత్, నిధి సదస్య సమాధాన్ శిబిర్ పేరుతో నిర్వహించే వాళ్లమని పేర్కొంది. నిధి ఆప్కా నికత్ లేదా పిఎఫ్ నియర్ యు అనే పేరుతో సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. పిఫ్ ఖాతాదారులు డిసెంబర్ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఎంప్లాయర్స్ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు హాజరై తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపింది. బర్కత్‌పురాలోని పిఫ్ ప్రాంతీయ కమిషనర్ కార్యాలయంలో ఈ వేదిక జరుగుతుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా గానీ లేదా పోస్టు ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా తమ సమస్యలను పిఎఫ్ కార్యాలయం దృష్టికి తీసుకురావచ్చని తెలిపింది.