అంతర్జాతీయం

బోకో హరామ్ నరమేథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైజీరియాలో 80 మంది ఊచకోత
మైదుగురి (నైజీరియా), డిసెంబర్ 28: నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని మైదుగురి నగరంలో బోకో హరామ్ సంస్థకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు సోమవారం భీకర దాడులకు తెగబడి దాదాపు 80 మందిని ఊచకోత కోశారు. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, ఆత్మాహతి బాంబర్లతో తీవ్రవాదులు దాడులు జరిపారని, గత కొన్ని నెలల్లో ఇటువంటి దాడులు జరగడం ఇదే తొలిసారి అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మదగలీ పట్టణంలో మార్కెట్‌కు సమీపాన నిత్యం రద్దీగా ఉండే బస్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడులకు తెగబడటంతో 30 మంది మృతిచెందగా, ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో 50 మంది ప్రజలు మరణించారని స్థానికులు తెలిపారు. ఇదిలావుంటే, బోకో హరామ్ తీవ్రవాదులు దాడులకు తెగబడిన విషయం నిజమేనని ఈశాన్య ప్రాంతంలోని అజమవా రాష్ట్ర కమాండింగ్ ఆఫీసర్ బ్రిగేడియర్ జనరల్ విక్టర్ ఎజుగ్వు ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్య ఎంతన్నదీ తేలాల్సి ఉందని ఆయన చెప్పారు.