జాతీయ వార్తలు

నిబంధనల ప్రకారమే ‘స్పెక్టర్’కు కోతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమర్శకులపై సెన్సార్ బోర్డు చీఫ్ ఎదురుదాడి
పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్న నిహ్లానీ
చండీగఢ్, నవంబర్ 24: జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’లోని ఒక చుంబన దృశ్యం నిడివిని కుదించినందుకు తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లజ్ నిహ్లానీ ఎదురుదాడికి దిగారు. నియమ నిబంధనల ప్రకారమే ఈ చిత్రంలో మార్పులు చేశానని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. చలనచిత్రాలను సర్టిఫై చేయడంలో నిహ్లానీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే జేమ్స్‌బాండ్ చిత్రాలకు గతంలోనూ ఎన్నో భారీ కోతలు విధించడం జరిగిందని, కానీ ఇప్పుడే ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదని నిహ్లానీ అన్నారు. తాను ఎన్నడూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని, కనుక సెన్సార్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని ఆయన ఫోనుద్వారా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. వాస్తవానికి చాలా తక్కువ కోతలతో ‘స్పెక్టర్’ చిత్రాన్ని విడుదలకు అనుమతించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిత్ర నిర్మాతలు లేఖ రాశారని, సెన్సార్ బోర్డుకు ఇటువంటి లేఖ రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చని ఆయన అన్నారు. ప్రముఖ నటుడు డేనియల్ క్రెయిగ్ ముఖ్యపాత్ర పోషించిన నూతన జేమ్స్‌బాండ్ చిత్రం ‘స్పెక్టర్’కు సెన్సార్ బోర్డు యు/ఎ సర్ట్ఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు అధ్యక్షునిగా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2173 చిత్రాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని, వీటిలో 2125 చిత్రాలు మరోసారి పరిశీలనకు వెళ్లకుండానే విడుదలయ్యాయని ఆయన తెలిపారు.