బిజినెస్

రిలయన్స్ లైఫ్‌లో 49 శాతానికి నిప్పాన్ లైఫ్ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 2,265 కోట్లతో అదనంగా 23 శాతం వాటా కొనుగోలు

న్యూఢిల్లీ, నవంబర్ 24: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మరో 23 శాతం వాటాను జపాన్‌కు చెందిన నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అందుకుంటోంది. దాదాపు 2,265 కోట్ల రూపాయలకు ఈ వాటాను సొంతం చేసుకుంటున్నట్లు మంగళవారం నిప్పాన్ ప్రకటించింది. దీంతో రిలయన్స్ లైఫ్‌లో నిప్పాన్ లైఫ్ వాటా 49 శాతానికి చేరుతోంది. ఇప్పటిదాకా 26 శాతం వాటా మాత్రమే ఉంది. కాగా, బీమా రంగంలో నెలకొన్న మందగమనంతో సంబంధం లేకుండా సుమారు 10,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కలిగి ఉన్న రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్.. మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో అత్యధిక ఈవి మల్టీపుల్‌ను కలిగి ఉంది. ఇదిలావుంటే రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు అసెట్ మేనేజ్‌మెంట్ విభాగమైన రిలయన్స్ క్యాపిటల్‌లో 49 శాతానికి వాటాను పెంచుకోవడానికి నిప్పాన్ లైఫ్ మొత్తం 8,630 కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటనలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ స్పందిస్తూ ఇరు సంస్థల వ్యాపార సంబంధాన్ని కొనియాడారు. తమ గ్రూప్‌లోని రెండు సంస్థల్లో 49 శాతం వాటాను నిప్పాన్ అందుకోవడాన్ని ఆహ్వానించారు. కాగా రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో ప్రస్తుతం నిప్పాన్‌కు 35 శాతం వాటా ఉంది. దీంతో 1,196 కోట్ల రూపాయలతో మరో 14 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు నిప్పాన్ అంగీకరించింది.
రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ అమ్మకం?
రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ అమ్మేస్తోంది. ఇందులో దాదాపు 96 శాతం వాటా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఉండగా, సుమారు 22,500 కోట్ల రూపాయలకు దీన్ని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అంతా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అధికారికంగా మరో పది రోజుల్లో ఓ ప్రకటన వెలువడొచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రం నిరాకరించింది. కాగా, ఈ అమ్మకం ద్వారా వచ్చే నిధులను రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ భారాన్ని తగ్గించడానికి వినియోగించనున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు 38,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇకపోతే రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 43,500 టవర్లున్నాయి.