జాతీయ వార్తలు

‘ఇండియాస్‌ డాటర్‌’ పై నిషేధాన్ని ఎత్తివేయలేం : దిల్లీ హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై బీబీసీ ఫిల్మ్‌మేకర్‌ లెస్లీ ఉడ్విన్‌ రూపొందించిన ‘ఇండియాస్‌ డాటర్‌’ అనే డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయలేమని దిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. నిర్భయ సులో శిక్ష పడిన దోషుల్లో ఒకరి వాంగ్మూలాన్ని లెస్లీ ఉడ్విన్‌ చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రసారం కాకుండా ట్రయల్‌ కోర్టు నిషేధించింది. ఈ డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ముగ్గురు యువ న్యాయవాదులు దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అంతర్జాలంలో ఈ డాక్యుమెంటరీ అందుబాటులో ఉన్నప్పుడు నిషేధం విధించడంలో ప్రయోజనం ఏమిటని కోర్టు గతంలో ప్రశ్నించింది. అయితే, నిషేధాన్ని ఎత్తివేయలేమని దిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది.