జాతీయ వార్తలు

కొందరి వల్ల అత్యాచార బాధితులకు న్యాయం జరగటం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలోని దోషులకు మరణశిక్ష అమలుచేయాలని దేశం ఎదురుచూస్తుంటే ఇందిరా జైసింగ్ వంటి వారి వల్ల అత్యాచార బాధితులకు న్యాయం జరగటం లేదని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటవ తేదీన మరణశిక్ష అమలుచేయాలని ఢిల్లీ హైకోర్టు మళ్లీ డెత్‌వారెంట్ జారీచేసిన విషయం విదితమే. దీనిపై ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్ మాట్లాడుతూ.. ‘నిర్భయ తల్లి ఆవేదనను అర్థంచేసుకోగలను. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళినీని సోనియాగాంధీ క్షమించారు. వారికి ఉరిశిక్ష పడాలని సోనియా కోరుకోలేదు. సోనియా వలే నిర్భయ తల్లి కూడా అనుసరించాలని కోరుకుంటున్నానని’ అన్నారు. ఇందిర జైసింగ్ వ్యాఖ్యలపై నిర్భయ తల్లి మండిపడ్డారు. ఇలాంటి సలహా ఇవ్వటానికి ఇందిర జైసింగ్ ఎవరు? ప్రపంచం మొత్తం నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటుంది. ఇలాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగటం లేదని అన్నారు.