జాతీయ వార్తలు

నిట్‌లో పరీక్షలు రాయని స్థానికేతరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఇక్కడి నిట్‌లో ఇంకా ఆందోళనకర వాతావరణం కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన వార్షిక పరీక్షలకు స్థానికేతర విద్యార్థులు హాజరు కాలేదు. తమపై దాడులు జరుగుతున్నా నిట్ అధికారులు స్పందించడం లేదని, తమను వేరే రాష్ట్రానికి పంపాలని స్థానిక విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాడుల భయంతో ఇప్పటికే కొంతమంది స్థానికేతర విద్యార్థులు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఇటీవల భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నిట్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణకు ఓ కమిటీని అధికారులు నియమించినా స్థానికేతర విద్యార్థులు శాంతించలేదు.