రాష్ట్రీయం

మిషన్ భగీరథపై నీతి ఆయోగ్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాయతీ రాజ్ ప్రత్యేక సిఎస్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 10: మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ ఆసక్తి చూపుతోందని, ప్రాజెక్టు వివరాలతో సమగ్ర నివేదిక పంపించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ తెలిపారు. మిషన్ భగీరథ, రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో ఎస్పీ సింగ్ గురువారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఏప్రిల్ 30 నాటికి మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికి తాగునీటిని అందించనున్నట్టు చెప్పారు. వర్షాభావం వల్ల వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పైప్‌లైన్ పనులు చేస్తూనే ఇంట్రా విలేజ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. సర్వే చేసి వివరాలు అందిస్తే వన్యప్రాణి, అభయారణ్యాల్లోనూ పనులకు ఇబ్బందులు రావని అన్నారు.