జాతీయ వార్తలు

‘సుప్రీం’ ముంగిట పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: తెలంగాణలో నిర్మించనున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణంతో తమప్రాంత ప్రయోజనాలకు భంగంవాటిల్లే ప్రమాదం ఉందంటూ గుంటూరు రైతులు దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే, రెండువారాల్లో ప్రత్యుత్తరం సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ జులై 20కి వాయిదా వేసింది.
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల తమకు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందంటూ గుంటూరు ప్రాంత రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం పిటిషన్‌ను జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ రోహింగ్టన్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ తరఫున సినియర్ న్యాయవాది ఏకె గంగూలీ, రైతుల తరపున న్యాయవాది వి గిరి వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని వాదించారు. ప్రాజెక్టుల కారణంగా తమ ప్రాంత ప్రయోజనాలకు త్రీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించినవేనని వివరించారు. కనుక కృష్టా నదీ యాజమాన్య బోర్డు అనుమతి అవసరం లేదన్నారు. పాత ప్రాజెక్టులను కొత్తవిగా చూపుతూ తెలంగాణలోని ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని ధర్మాసనానికి వివరించారు. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తూ, పూర్తి వాదనలు జూలై 20న వింటామని కేసు వాయిదా వేసింది.