ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలు విజయవంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 6: గురుడు కన్యారాశిలో ప్రవేశించడంతో ఆగస్టులో వచ్చే కృష్ణా పుష్కరాలు దిగ్విజయం కావాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. గోదావరి పుష్కరాల మాదిరిగా కాకుండా కృష్ణా పుష్కరాలు దిగ్విజయం కావాలంటే అధికారులు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అధికారుల మధ్య సమన్వయలోపం, భక్తుల మనోభావాలపై అవగాహనా లోపం కారణంగా గోదావరి పుష్కరాలు ఘోర తప్పిదాలు జరిగి అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
ప్రభుత్వం గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా నిర్వహించడమే ఇందుకు కారణమన్నారు. పోలీసులకు, భక్తులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. కృష్ణా పుష్కరాలు విజయవంతం చేసేందుకు వేద పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, శాస్తక్రోవిదులతో పుష్కర కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయ శాఖ వైఖరి కారణంగా ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అన్ని కులాలు హిందూ మతానికి దూరమవుతున్నాయన్నారు. సింహాచల క్షేత్రంలో చందనం చెక్క అరగదీతకు వంశపారంపర్యంగా ఉన్న ఒక కులం పట్ల దేవాదాయ శాఖ దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదన్నారు. దేవాదాయ శాఖలో అధికార్లు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ అర్చకులను అరకొర జీతాలతో అవస్థలపాలు చేస్తున్నారన్నారు.
అసలు అర్చకులు లేకపోతే దేవాలయాలకు ఆదాయమే లేదన్న విషయం గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు తెలంగాణలోని జిల్లాలతో కలుపుకుని అర్చక సమస్యలపై జూన్ మొదటి వారంలో విజయవాడలో సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. అర్చక వ్యవస్థపై దేవాదాయ శాఖ దాడిని ఎండగడతామన్నారు. సిజిఎఫ్‌ను దేవాదాయ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భగవంతుని భూములను 33 ఏళ్లకు లీజుకిచ్చే అధికారం దేవాదాయశాఖకు ఎక్కడిదని ప్రశ్నించారు.హిందువుల దేవాలయాలు హిందువుల చేతిలో ఉన్నపుడే హిందూ మతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఒక మతం ఆచార వ్యవహారాలను కోర్టులు నిర్దేశించలేవని స్వామీజీ పేర్కొన్నారు.