అంతర్జాతీయం

రెండు బస్సులు, ఆయిల్ ట్యాంక్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మే 8: అఫ్గాన్‌లోని ఒక హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 73 మంది మరణించగా, దాదాపు యాభై మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. రెండు బస్సుల్లో దాదాపు 125 మంది ఉన్నట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్‌ను బస్సులు ఢీకొనడంతో, మూడు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు సమీపంలోని ఘజినీ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో మృతి చెందిన 73 మందిలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతో తీవ్రంగా కాలిన గాయాలతోనే మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఘజినీ, కాందహార్‌లోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో చాలామంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, ఈ హైవే రాజధాని కాబూల్‌కు అనుసంధానం కావడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని, మధ్యాహ్న సమయానికి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించామని ఘజినీ ప్రావెన్స్ గవర్నర్ ప్రతినిధి జావెద్ సాలంగి విలేఖరులకు తెలిపారు. అఫ్గాన్‌లో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.

గత ఏడాది మే నెలలో బాద్గిస్ ప్రావిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతిచెందగా, 2013 ఏప్రిల్‌లో కాందహార్‌లో జరిగిన ప్రమాదంలో 45 మంది మరణించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం