అంతర్జాతీయం

హిందూ బాలుడిపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, మే 8: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో 11 ఏళ్ల హిందూ బాలుడిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన సంఘటన పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. సింధ్ రాష్ట్రంలోని హైదరాబాద్ క్లబ్‌లో గత నెల 13న ఈ సంఘటన చోటుచేసుకుంది. క్లబ్ లోపల గట్టి భద్రతా ఏర్పాట్లున్నన్పటికీ తన కుమారుడు గంటసేపు కనిపించకుండా పోయాడని, ఆ తర్వాత అతని మృతదేహం క్లబ్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో కనిపించిందని బాలుడి తండ్రి, డాక్టర్ అయిన చేతన్ కుమార్ చెప్పారు. తన కుమారుడ్ని లైంగికంగా హింసించి, అనంతరం ఉద్దేశపూర్వకంగా స్విమ్మింగ్‌పూల్‌లోకి తోసి చంపేశారని ఆయన ఆరోపించారు. తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన క్లబ్ యాజమాన్యం సంఘటన జరిగిన రోజు సిసిటీవీ ఫుటేజ్‌లను తనకు ఇవ్వలేదని కూడా ఆయన ఆరోపించారు. కాగా, సిసిటీవీ దృశ్యాలను సంపాదించామని, సంఘటన జరిగిన రోజు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి క్లబ్ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి రాహత్ అజీమ్ చెప్పారు. అయితే తన కుమారుడి ముఖంపైన, శరీరంపైన చిత్రహింసలకు గురిచేసిన గుర్తులున్నాయని, మొదట అతడ్ని లైంగిక వేధింపులకు గురిచేసి, ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హత్య చేశారని బాలుడి తండ్రి ఆరోపిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా, బాలుడి హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పెద్దఎత్తున ఆందోళన కారులు సింధ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ‘డాన్’ పత్రిక తెలిపింది.