జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు మరో ముసురు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: కాంగ్రెస్ పార్టీని మరో పెనుకుంభకోణం చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిఐపిల కోసం ఉద్దేశించిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ముడుపుల వ్యవహారంలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీకి అంతకు మించిన స్థాయిలోనే ఇంకో స్కామ్ ఇరుకున పడేసే సూచనలున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో సాగిన యూపీఏ హయాంలోనే నౌకాదళానికి సంబంధించి ఈ కుంభకోణం జరిగినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. నౌకాదళం కోసం ఉద్దేశించిన ఓ భారీ నౌక నిర్మాణం కోసం నాసిరకం ఉక్కును సరఫరా చేశారన్నది ఈ వ్యవహారం.నౌకాదళానికి సంబంధించిన ఈ తతంగం బయట పడితే అది అగస్టాను మించిన స్థాయిలోనే ప్రకంపనలు పుట్టించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. భారత్‌కు రెండు నౌకాదళ ట్యాంకర్లను అందించిన ఇటలీ కంపెనీకి నాటి యుపిఏ సర్కార్ లబ్ధి చేకూర్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ట్యాంకర్ల కుంభకోణంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇప్పటికే రహస్యంగా దర్యాప్తుకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. 2009లో రెండు నౌకా ట్యాంకర్లను నిర్మించి ఇచ్చే కాంట్రాక్టును అప్పటి యుపిఏ ప్రభుత్వం ఫిన్‌కాంటియెరీ అనే ఇటలీ సంస్థకు అప్పగించిందని, నాసిరకం ఉక్కును వినియోగించడానికి కూడా ఆమోదం తెలిపినట్టుగా కథనాలు వెలువడ్డాయి. సముద్ర లోతుల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ట్యాంకర్లు అత్యంత కీలకమని, వీటి కాంట్రాక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరపాల్సిందేనని మాజీ నౌకాదళ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆయుధాల తయారీకి ఉపయోగించాల్సిన ఉక్కునే ఈ నౌకా ట్యాంకర్ల తయారీకి వినియోగించాల్సి ఉంటుందని, కానీ ఆ ఇటలీ సంస్థ వాణిజ్య గ్రేడ్ ఉక్కునే ఇందుకు ఉపయోగించిందని చెబుతున్నారు.